వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న అన్ని పార్టీల నాయకులు ప్రధానంగా చేస్తున్న ప్రచారం ఒక్కటే.ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.
ఈ విమర్శ తరువాతే మిగతా విమర్శలు చేస్తున్నారు.అందరు నాయకులతోపాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా ఇదే విమర్శ చేస్తున్నారు.
తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ జిల్లా ప్రజలకు ఇచ్చిన ఏ హామీలో ముఖ్యమంత్రి నెరవేర్చలేదని డిగ్గీ రాజా విమర్శించారు.ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
గులాబీ పార్టీ పరిపాలన ఏమీ బాగాలేదన్నారు.అన్ని పార్టీల ప్రచారంలో కొత్త సంగతులు ఏమీ లేవు.
చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పిన సంగతులే జాతీయ నాయకులు చెబుతున్నారు.
ప్రచారంలో ఉన్న నాయకుల్లో టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి చాలా తీవ్ర పదజాలంతో కెసీఆర్ మీద విరుకుపడుతున్నారు.అందరి నాయకుల కంటే రేవంత్ వాగ్ధాటి ఎక్కువగా ఉంది.