అఖిల్‌ 6 నెలలు ఏం చేస్తాడు?

అక్కినేని వారి ప్రిన్స్‌ అఖిల్‌ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్‌ ఎదురు చూశారు.అఖిల్‌ వచ్చాడు, వెళ్లాడు.

 6 Months Rest Of Hero Akhil-TeluguStop.com

మొదటి చిత్రం ‘అఖిల్‌’ తీవ్రంగా నిరాశ పర్చడంతో అఖిల్‌ డిప్రెషన్‌లోకి వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది.‘అఖిల్‌’ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న తర్వాత అఖిల్‌ మళ్లీ కనిపించింది లేదు.

దాంతో అఖిల్‌ తన మొదటి చిత్రం ఫ్లాప్‌ కావడంతో ఆలోచనల్లో పడ్డట్లుగా చెబుతున్నారు.రెండవ సినిమా కోసం కనీసం ఆరు నెలలు గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాడు.

ఈ ఆరు నెలలు అఖిల్‌ ఏం చేస్తాడు అనేది ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది.అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అఖిల్‌ అమెరికా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

అక్కడే కొన్ని నెలల పాటు ఉండబోతున్నాడు.ఆ సమయంలో అమెరికాలోని ప్రముఖ యాక్టింగ్‌ స్కూల్‌లో నటనలో శిక్షణ తీసుకోబోతున్నాడు.

ఫైట్స్‌, డాన్స్‌లలో దుమ్ము రేపిన అఖిల్‌ రొమాంటిక్‌ సీన్స్‌ మరియు కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లలో తేలి పోయాడు అనే టాక్‌ వచ్చింది.దాంతో అఖిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇక ఈయన రెండవ సినిమా కోసం నాగార్జున క్రిష్‌ మరియు త్రివిక్రమ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఇద్దరిలో ఎవరి దర్శకత్వంలో అఖిల్‌ రెండవ సినిమా ఉండనుంది అనేది త్వరలో తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube