వచ్చే ఎన్నికల్లో మోడీ( Modi ) టార్గెట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఎలాగైనా కేంద్రంలో మోడీని గద్దె దించాలని గట్టి పట్టుదలగా ఉన్నారాయన.
ఇప్పటికే ఆదిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకంగా చేసేందుకు వ్యూహరచన కూడా సిద్దం చేసుకుంటున్నారు.
కాగా మరోవైపు ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్న కేజ్రివాల్ ( Kejriwaal ) కూడా వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించాలనే ఎజెండాతోనే ఉన్నారు.మరి అటు కేజ్రివాల్ ఇటు కేసిఆర్ ఇద్దరు ఒకే ఎజెండాతో ఉండడంతో ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులు కలిసి నడవబోతున్నారా అంటే ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇటీవల కేజ్రివాల్ కేసిఆర్ తో భేటీ అయ్యారు.ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చకు తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రివాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే కేసిఆర్ తో కేజ్రివాల్ బేటీ అనే అధికారిక సమాచారం ఉన్నప్పటికి, ఈ సమావేశానికి మరో కారణం కూడా ఉందట.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ దిశగా ఎలాంటి అడుగులు వేయాలి ? ఎలాంటి వ్యూహాలతో మోడీ సర్కార్ కు చెక్ పెట్టాలి ? అనే విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

కాగా బీజేపీని ఎదుర్కొనేందుకు అరవింద్ కేజ్రివాల్ మరియు కేసిఆర్ ఒక్కటైతే.ఆ ప్రభావం బీజేపీ పై గట్టిగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుతం దేశం బీజేపీ, కాంగ్రెస్ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది.
ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో అప్ కు బలమైన క్యాడర్ ఉంది.ఇక ప్రస్తుతం బిఆర్‌ఎస్ కూడా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగే విమర్శలు గుప్పించడంలో కేసిఆర్ సిద్దహస్తుడు.అలాంటి కేసిఆర్ తో కేజ్రివాల్ జట్టు కడితే విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావడానికి ఎంతో సమయం పట్టడాని నిపుణులు చెబుతున్నారు.
మరి ఈ దోస్తీ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
