కేసీఆర్ క‌రెక్టే... జ‌గ‌నే ఆ విష‌యంలో ట్రాక్ త‌ప్పాడా...!

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభ‌మ‌వుతోంద‌న్న వేళ మ‌రోసారి ప్ర‌పంచం క‌రోనా గుప్పిట్లోకి వెళ్ల‌క త‌ప్ప‌దా ?  మ‌రిన్ని కేసులు.

మ‌రిన్ని మ‌ర‌ణాలు సంభ‌విస్తాయా ? అన్న సందేహాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నాయి.ఇలాంటి స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ స్కూళ్లు, కాలేజ్‌లు ప్రారంభించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై సందేహాలు, విమ‌ర్శ‌లే వ‌స్తున్నాయి.

అస‌లు క‌రోనా ఉదృతంగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ క‌రోనాతో క‌లిసి స‌హ‌జీవ‌నం చేయ‌క‌త‌ప్ప‌ద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై ముందు విమ‌ర్శలు వ‌చ్చినా త‌ర్వాత అస‌లు వాస్త‌వం అంగీక‌రించిన దేశం అంతా జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించ‌క త‌ప్ప‌లేదు.ఒక ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ధైర్యంతోనే ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి ఆ స్థాయి ధైర్యం లేక‌పోతే పాల‌నా ప‌రంగా ఇంకా ఎన్నో ఇబ్బందులు వ‌చ్చేవి.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌డుతోంది.

ఈ స‌మ‌యంలో క‌రోనాను జీరో స్థాయికి చేర్చేయాలి.అందుకు భిన్నంగా జ‌గ‌న్ ఇప్పుడు స్కూల్స్‌, కాలేజీలు తెర‌వాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై కాస్త సందేహాలు, కొంద‌రి నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Advertisement
KCR Takes Right Decision On Schools Re Open, Schools Re Open, KCR, YS Jagan, Cor

ఏదేమైనా ఈ యేడాది పిల్ల‌ల‌కు విద్యాప‌రంగా కాస్త వెన‌క‌బాటు త‌ప్ప‌దు.

Kcr Takes Right Decision On Schools Re Open, Schools Re Open, Kcr, Ys Jagan, Cor

అయినా ఏదోలా ఆన్‌లైన్ క్లాసులో లేదా వీడియో క్లాసుల‌తోనే కొంత కొంత నేర్చుకుంటున్నారు.అన్నింటికి మించి పిల్ల‌ల‌కు ఆరోగ్యం చాలా ముఖ్యం.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాలేజీలు, యూనివ‌ర్సిటీలు, థియేట‌ర్లు ఓపెన్ చేసే విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఆచితూచి నిర్ణ‌యం తీసుకుంటోంది.

ఒక్క‌సారిగా స్కూల్స్‌, థియేట‌ర్లు, కాలేజ్‌లు ఓపెన్ చేస్తే క‌రోనా జోరు మామూలుగా ఉండ‌దు.వైర‌స్ వ్యాప్తి ముప్పు చాలా ఎక్కువుగా ఉంటుంది.ఇప్ప‌టికే ఏపీలో టీచ‌ర్లు, పిల్ల‌ల్లో భారీ ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.

వీరితో ఇళ్ల‌ల్లో ఉన్న పెద్ద‌ల‌కు కూడా క‌రోనా ముప్పు ఎక్కువ‌గానే ఉంటుంది.క‌రోనా స‌గ‌టు జీవి మీద ఎంతో ప్ర‌భావం చూపుతుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..

ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎందుకు తొంద‌ర‌ప‌డి కాలేజ్‌లు, స్కూళ్లు, థియేట‌ర్ల ప్రారంభానికి అనుమ‌తి ఇచ్చారు అన్న సందేహాలు ప్ర‌తి ఒక్క‌రిని వెంటాడుతున్నాయి.ఏదేమైనా ఈ విష‌యంలో జ‌గ‌న్ మ‌రోసారి పునరాలోచించుకోక‌పోతే ఏపీలో మ‌ళ్లీ కేసులు విజృంభించ‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు