మళ్ళీ అధికారంపై నమ్మకంగా కేసీఆర్.. అసలు విషయం ఇదే

తెలంగాణ లో వచ్చే రెండున్నర సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచాలనే వ్యూహంతో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే.

 Kcr Confident Of Power Again This Is The Real Thing, Kcr, Trs Party-TeluguStop.com

అయితే ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన తరుణంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సమరం రసాభాసకంగా మారే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంపై చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే.

మొదటి సర్వేను చేయించుకున్న కేసీఆర్ ప్రజల ఆలోచన ఎలా ఉందనే విషయంపై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తారనే నమ్మకంతో కెసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.అభివృద్దినే ముఖ్యంగా తన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఇప్పటికే హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో మరల అధికారంలోకి వస్తే తెలంగాణ ఏ విధంగా అభివృద్ది చెందుతుంది అనే విషయంపై తనదైన శైలిలో స్పష్టత నిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో కొద్దిగా టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే స్థానాలు తగ్గినా మరల అధికారం మాత్రం కోల్పోయే అవకాశం మాత్రం లేదని ఎందుకంటే ప్రజలు ఏ విషయంపై ఆగ్రహంగా ఉన్నారో ఆ విషయాలను ప్రజామోదం పొందేలా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telangana CM KCR Confident on winning Next election

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube