తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలంగా దూసుకెళ్తున్న పరిస్థితులలో టీఆర్ఎస్ పై రోజురోజుకు విమర్శల దాడి పెంచుతూ క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఈ సందర్భంలో టీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తూ మంత్రులపై, కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తూ అదే విధంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా రకరకాల అంశాలు ప్రచారం ప్రజల దృష్టిని బీజేపీ వైపు మరల్చేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేస్తోంది.
ఇక వీటన్నింటిపై కేసీఆర్ ఇప్పటికీ ఒక్కసారిగా స్పందించలేదు.ఈ సందర్భంలో నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఇతర నాయకులతో కలిసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ కార్యవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ సందర్బంగా కేటీఆర్ ను సీఎంగా చేయాలనే అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అంతేకాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు,ఇటీవల ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇటువంటి విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.చూద్దాం మరి కేసీఆర్ వీటన్నింటి విషయాల మీద స్పష్టత ఇస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది
.