కలిసిన కెసిఆర్ - చంద్రబాబు

ఇద్దరు ‘చంద్రులు’ మరోమారు కలిశారు.ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన న్యాయాధికారుల సదస్సు వేదికగా నిలిచింది.

 Kcr-cbn Met Another Time-TeluguStop.com

భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాలుపంచుకున్న ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు హాజరయ్యారు

చంద్రబాబు, కేసీఆర్ లు ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు.ఈ సందర్భంగా తొలుత చంద్రబాబు మాట్లాడగా, ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఇరువురూ… పరస్పరం పేర్లు ప్రస్తావించుకున్నారు.వేదికపై కూర్చున్న వారిద్దరి మధ్య ముగ్గురు న్యాయమూర్తులు కూర్చోగా, చంద్రబాబు పక్కన తెలంగాణ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆసీనులయ్యారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube