వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.తన పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోపలికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నిన్న ఆయన సభలో అడుగు కూడా పెట్టలేదు.
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలతో కలిసి బైఠాయించిన జగన్… ఆ తర్వాత నేరుగా రాజ్ భవన్ కు చేరుకున్నారు.అంతకుముందే ఆయన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కార్యాలయానికి ఫోన్ చేశారు.
అయితే గవర్నర్ అందుబాటులో లేరన్న సమాచారంతో జగన్ తన మొబైల్ ఫోన్ బయటకు తీశారు.నరసింహన్ మొబైల్ నెంబరుకు డయల్ చేశారు.
జగన్ కాల్ ను రిసీవ్ చేసుకున్న నరసింహన్ తాను హైదరాబాదులో లేనని చెప్పారు.వినతి పత్రం ఇద్దామనుకుంటున్నామన్న జగన్ ప్రతిపాదనకు స్పందించిన నరసింహన్… తన కార్యదర్శికి ఇవ్వండని చెప్పారు.
దీంతో వినతి పత్రాన్ని గవర్నర్ కార్యదర్శికి ఇచ్చిన జగన్… మరోమారు నరసింహన్ కు ఫోన్ చేశారు.వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని నరసింహన్ కు చెప్పిన జగన్… స్పీకర్ కోడెల శివప్రసాద్ వైఖరిపై ఫిర్యాదు చేశారు.
.






