తెలంగాణలో ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఆర్ టిసీ కార్మికుల సమ్మె.తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతూనే ఉంది.
ఇటు కార్మికులు అటు ప్రభుత్వం ఈ విషయంలో ప్రతిష్టంభనకు వెళ్లడంతో ఈ సమస్య మరింత జటిలం అవుతోంది.కార్మికుల సమ్మె పై ప్రభుత్వ తీరును సాక్షాత్తు హైకోర్టు తప్పు పట్టినా కెసిఆర్ ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోంది.
దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడం తో పాటు ఇది చాలా నష్టాన్ని ప్రభుత్వానికి, టిఆర్ఎస్ కు కలిగిస్తుందని నిఘా వర్గాల సమాచారంతో కెసిఆర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ భారీగా ప్రక్షాళన చేసి గాడిలో పెట్టాలని కెసిఆర్ భావిస్తున్నాడు.ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, అవి అరకొరగానే ఉన్నాయి.దీంతో నవంబర్ 2న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.
అయితే తెలంగాణ ఆర్టీసీ మూడు ముక్కలుగా చేసి 50 శాతం యాజమాన్యం, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేటీకరణ రూపంలో బస్సులు నడపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

ఇక ఈ భేటీలోనే అద్దె, ప్రైవేట్ బస్సులకు స్టేజి కేరియర్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారట.పనిలో పనిగా క్యాబినెట్ మీటింగ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ఈరోజు హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై విచారణ జరగనుంది.
ఈ సందర్భంగా కోర్టు ఏం తీర్పు ఇస్తుందో అన్న సందిగ్దత అటు ఆర్టీసీ కార్మికులను ఇటు ప్రభుత్వ పెద్దల్లోనూ నెలకొంది.కోర్టు తీర్పు ఆధారంగా సమ్మె, కార్మికుల డిమాండ్లపై తగిన నిర్నయాయం తీసుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.