కాళేశ్వరం ప్రాజెక్టులపై వాస్తవాలను సభ ముందు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.రాజ్యాంగబద్ధ సంస్థలు మాట్లాడిన మాటలు తాము సభలో చెప్పామన్న రేవంత్ రెడ్డి ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు చెప్పొచ్చని సూచించారు.
తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పి సలహాలు ఇవ్వాలన్నారు.తప్పుల తడక అని తప్పించుకోవాలని హరీశ్ రావు చూస్తున్నారని మండిపడ్డారు.
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కడితే నిరుపయోగం అని కమిటీ నివేదిక ఇచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టాలని సూచించిందని వెల్లడించారు.కానీ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలన్నది కేసీఆర్( KCR ) ఆలోచనేనని పేర్కొన్నారు.కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారన్న ఆయన ఇప్పుడు సబిత ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
.