ఒకే సారి రెండు వ్యూహాలను ప్రయోగిస్తున్న కెసీఆర్.. సఫలమయ్యేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున ప్రతిపక్షం, అధికార పక్షం విమర్శలు, ప్రతి విమర్శలతో ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో అంతేకాక కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కంటే మెరుగైన స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

అయితే ప్రస్తుతం కెసీఆర్ ఇటు బీజేపీ వ్యవహార శైలిని మరియు కాంగ్రెస్ వ్యవహార శైలిని గమనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ మాత్రం ఇటు ప్రతిపక్షాల వైఖరిని గమనిస్తూనే రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు కేవలం వ్యూహాలు రూపొందించడంపై దృష్టి పెట్టిన కెసీఆర్ ఇక వ్యూహాల అమలుపై తనదైన శైలిలో ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది.ఒకవైపు అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తూ ఇటు టీఆర్ఎస్ పార్టీ అనుకూల వాతావరణాన్ని పెంచుతూనే ఒకవైపు ప్రజాగ్రహ విషయాలను హామీలను నెరవేర్చే దిశగా దృష్టి సారించడం ద్వారా ఇటు రెండు వైపులా ప్రజల దృష్టి టీఆర్ఎస్ వైపు ఆకర్షించడంతో పాటు ఇక ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా అంతగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు అనేది కెసీఆర్ వ్యూహంలా అనిపిస్తోంది.

అయితే ఈ ద్విముఖ వ్యూహం అనేది ఎంత వరకు కెసీఆర్ లాభం చేకూరుస్తుందన్నది ఇప్పుడే మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Advertisement

అయితే కెసీఆర్ మాత్రం ముచ్చటగా మూడో సారి ఎన్నికల బరిలో విజయఢంకా మోగిస్తామనే నమ్మకంగా ఉన్నట్టు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.అందుకు తగ్గ అస్త్రాలు అన్ని కెసీఆర్ వద్ద ఉన్నాయని, ఎన్నికల సమయంలో ప్రత్యేక వ్యూహం ద్వారా ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు