ఏపీ రాజకీయాలు ప్రస్తుతం గందరగోళంగా కనిపిస్తున్నాయి.ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో… రాజకీయ పార్టీలు కంగారు కంగారుగా కనిపిస్తున్నాయి.
ఈ సమయంలోనే… రాజకీయ పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు నడుస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న రాజకీయ పార్టీలు ఎవరితో అయినా కలిసిపోయి గెలుపు జెండా రెపరెపలాడించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఏపీలో ఎన్నికల బరిలోకి చాలా పార్టీలే వెళ్తున్నా… ప్రస్తుతం ఇక్కడ పోటీ అంతా … మూడు ప్రధాన పార్టీల మధ్యే అన్నది స్పష్టమైంది.

ఈ నేపథ్యంలోనే… ఎవరు ఎవరితో కలిసి ముందుకు వెళ్తారు అనేది క్లారిటీ రావడంలేదు.జనసేన – వైసీపీ పొత్తు పెట్టుకుని టీడీపీ మీద దండయాత్ర చేస్తాయని వార్తలు వచ్చినా… అలాంటిది ఏమీ లేదని రెండు పార్టీల అధినేతలు ఇద్దరూ క్లారిటీ ఇచ్చేసారు.దీంతో ఇక ఈ మూడు పార్టీలు విడివిడిగానే తలపడబోతున్నాయని అంతా … భావించారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఏపీలో ఎన్నికల వేడి రగిల్చేందుకు రంగంలోకి దిగిపోయింది.
ఆ పార్టీ ఇక్కడ పోటీలో లేకపోయినా… వైసీపీకి మద్దతు పలికింది.ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడానా చేసేందుకు సిద్ధం అయిపొయింది.
ఈ నేపథ్యంలో జనసేన , టీడీపీ మాత్రమే ఒంటరిగా మిగిలిపోయాయి.అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి వెళ్ళబోతున్నాయని అనేక కధనాలు కొద్దిరోజులుగా వస్తున్నాయి.

టీఆర్ఎస్ తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని.ఎపీ ఎన్నికల్లో కేసీఆర్ తనకు మద్దతిస్తారని పవన్ ఆశించారని… కానీ అయన జగన్ కు మద్దతు పలకడంతో హర్ట్ అయ్యారని అనేక కథనాలు బయటకి వస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం అంటే.రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పవన్ భావిస్తున్నారని అందుకే టీడీపీ తో జనసేన ఎన్నికల పొత్తు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు అనేక జాతీయ మీడియా ఛానెల్స్ లో కథనాలు ప్రచారం అయ్యాయి.
ప్రస్తుతం జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నపవన్ ఆ సమయంలో.జగన్ పై విమర్శలు గుప్పించారు కానీ చంద్రబాబును విమర్శించలేదు.
అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు.అదే సమయంలో.
జగన్ తో పొత్తుల కోసం టీఆర్ఎస్ నేతలు రాయబారం నడుపుతున్నారని కూడా ప్రకటించిన సంచలనం రేపారు.అంతకు కొద్ది రోజుల ముందు.
జనసేన టీడీపీతో కలిస్తే తప్పేమిటన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఓ రాజకీయ దుమారం రేగింది.రెండురోజుల పాటు ఈ వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్.
ఆ తర్వాత ఎవరితోనూ పొత్తు ఉండదని ప్రకటించారు.కానీ ఇది నిజం ఎందుకు కాకూడదు అనే ఆలోచన పవన్ మదిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలే ఎన్నికల సమయం కదా ఏదైనా జరగొచ్చు.