సీన్ రివర్స్ : కవితా అటాక్:.. ఈడీ డిఫెన్స్!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనే సామెత మనం వినే ఉంటాం.కొన్ని సంబర్భాల్లో ఒకరు చేయాల్సిన పనులను ఇంకొకరు చేస్తుండడం వంటివి చూసినప్పుడు ఇలాంటి సామెతలను వాడుతుంటాము.

 Kavitha Questioned Ed, Kavitha  , Delhi Liquor Scam  , Ed , Brs , Kcr , Question-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ కవితా( Kavitha ) మరియు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విషయంలో ఈ సామెత వాడాల్సి వస్తోంది.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) లో అనుమానితురాలుగా కవితా పేరు చేర్చింది ఈడి.ఇప్పటి నుంచి కవిత చుట్టూ ఈ లిక్కర్ స్కామ్ వెంటాడుతోంది.ఇప్పటికే పలుమార్లు విచారణకు కూడా హాజరైంది.

ఈ నేపథ్యంలో కవితా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా బాగానే వినిపిస్తున్నాయి.ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే మూడుసార్లు విచారించిన ఈడి.ఏ దశలోనూ ఆమెను దోషిగా నిర్ధారించడం లేదు.ఈ నెల 11న ఆమెను ;రెండవసారి విచారించగా ఆమెపై వివిధ రకాల ప్రశ్నలను సంధించారట ఈడి అధికారులు.

Telugu Brs Mlc Kavita, Delhi Scam, Ts-Politics

అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆధారాలుగా ఉన్న మొబైల్స్ ను కవిత పగలగొట్టరాని, ఆధారాలు దొరకాకుండా చేసేందుకు కవితా ప్రయత్నిస్తోందని ఈడి చెప్పగా.ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కావాలని ఈడి కవితకు నోటీసులు జారీచేసింది.అయితే ఆమె 20వ తేదీ విచారణకు హాజరవుతానని చెప్పారు.ఇక 20వ తేదీ జరిగిన విచారణలో దాదాపు 11 గంటల పాటు కవితను విచారించిందట ఈడి.అయితే ఈ విచారణలో కవితనే ఈడిని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.ఆసక్తికర విషయం ఏమిటంటే కవితా ఫోన్లు పగలగొట్టిందనే ఈడి వాదనకు చెక్ పెడుతూ తాను ఇప్పటివరకు వినియోగించిన అన్నీ ఫోన్లను ఈడి ముందు ప్రవేశ పెట్టింది కవిత.

దీంతో ఈడి అధికారులు నోరెళ్ళబెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Brs Mlc Kavita, Delhi Scam, Ts-Politics

అంతే కాకుండా ఒక మహిళ రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా విచారించడం ఏమిటి? తనపై ఈ ఆరోపణలు మోపడానికి ఉన్న ఆధారాలు ఏంటి అని కవితనే ఈడిని ప్రశ్నించిందట ? దీంతో కవిత ప్రశ్నల దాడికి ఈడి అధికారులు చిన్నబోయినట్లు సోషల్ మీడియాల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ వార్తలు వైరల్ అయ్యాయి.లిక్కర్ స్కామ్ లో ఈడి తనను కావాలనే టార్గెట్ చేస్తోందని, ఇదంతా కేంద్ర ప్రభుత్వ కక్ష పూరిత చర్యేనని ఎమ్మెల్సీ కవిత మరియు బి‌ఆర్‌ఎస్( BRS ) నేతలు తరచూ చెబుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కవిత విచారణలో చోటుచేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది నిజమేనేమో అని కొందరి అభిప్రాయం.

మొత్తానికి డిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజా పరిణామాలను చూస్తే అటాకింగ్ మోడ్ లో ఉండాల్సిన ఈడి డిఫెన్స్ లోకి పడిపోవడం, డిఫెన్స్ లో ఉండాల్సిన ఎమ్మెల్సీ కవిత అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళడం.వంటివి చూస్తే అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఇంకెన్ని మలుపులు ఉంటాయో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube