కవిత ప్లాన్ సక్సెస్.. బీజేపీ, కాంగ్రెస్ లో చిచ్చు..!!

కేసీఆర్ (KCR) ముద్దుబిడ్డగా కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది.కేటీఆర్ కంటే కూడా కవిత రాజకీయాలు చేయడంలో దిట్ట.

అందుకే కేసీఆర్ చాలావరకు బాధ్యతలు కవితకు కట్టబెడతారు.అయితే అలాంటి కవిత తన మాస్టర్ ప్లాన్ తో కాంగ్రెస్,బిజెపిలో పెద్ద చిచ్చు పెట్టింది.

మరి ఇంతకీ కవిత వేసిన ఆ ప్లాన్ ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కాంగ్రెస్ బిజెపిలలో సీఎం చిచ్చు పెట్టింది.

మేము మా సీఎం కేసీఆర్ అని చెప్పుకొని ప్రజల్లో ఓట్లు అడగడానికి వెళ్తున్నాం.మరి ఈ రెండు పార్టీలలో ముందుగా సీఎం ఎవరో చెప్పి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలి అంటూ కవిత సంచలన కామెంట్లు చేసింది.

Advertisement

ఇక కవిత మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ గా తీసుకొని ఎల్బీ స్టేడియంలో నేనే సీఎం గా ప్రమాణం చేస్తాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.ఇక ఇప్పటికే కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు నేనంటే నేను సీఎం అంటూ కొట్టుకుంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మాటలతో అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇలా పలువురు సీనియర్ నాయకులు మేం కూడా సీఎం అవుతాం అని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి అలా చెప్పడంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా చిచ్చు రాజుకుంది.దాంతో ఎవరి నియోజకవర్గంలో వారే పరిమితమై రాష్ట్రమంతా తిరిగి మిగిలిన నాయకులకి మద్దతు ఇవ్వడం మానేశారు.ఇలా ప్రస్తుతం కాంగ్రెస్లో సీఎం ఎవరు( Congress CM ) అవుతారు అనే దానిపై స్పష్టత లేదు.

అలాగే బిజెపిలో ( BJP ) కూడా కవిత వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది.ఎందుకంటే ఈసారి బీసీని సీఎం చేస్తామని బిజెపి పార్టీ అధిష్టానం ప్రకటించింది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

దాంతో బీజేపీలో కీలక నాయకులుగా ఉన్న ఈటెల రాజేందర్(Etela Rajender) బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి వాళ్ళు మేము సీఎం అవుతామంటే మేం సీఎం అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలా ఈ ముగ్గురి మధ్యన కూడా సీఎం పీఠం ఎవరిది అనే పోటీతత్వం నెలకొంది.దీంతో కవిత వేసిన మాస్టర్ ప్లాన్ వల్ల కాంగ్రెస్ బిజెపిలు సీఎం అనే దానిపై లోలోపల కొట్టుకుంటున్నారని,ఈ ఎన్నికల్లో ప్రచారం మానేసి ఎవరు సీఎం అవుతారు అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.ఇక ఈ విషయంలో మాత్రం కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సూపర్ సక్సెస్ అయింది అని రాజకీయ విశ్లేషకులుభావిస్తున్నారు.

తాజా వార్తలు