కత్రినా కైఫ్ చాలా తిప్పలు పెట్టింది.. మల్లీశ్వరి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ "మల్లీశ్వరి (2004)( Malliswari )" ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.బోర్ కొట్టని ఈ సినిమాని కె.

విజయ భాస్కర్ డైరెక్ట్ చేశాడు.దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్‌, విజయభాస్కర్ ఇద్దరూ కలిసి స్టోరీ రాశారు.

ఈ సినిమాలో కత్రినా కైఫ్(Katrina Kaif ) మీర్జాపురం యువరాణి మల్లీశ్వరిగా నటించి మెప్పించింది.పనిమనిషిగానూ వేషం వేసింది.

వెంకటేష్ పెళ్లికాని ప్రసాద్, బ్యాంకు ఉద్యోగిగా కనిపించి అలరించాడు.ఈ మూవీలోని డైలాగులు చాలా బాగుంటాయి.

Advertisement

వాటిని త్రివిక్రమ్ శ్రీనివా సే (Trivikram Srinivas)రాశాడు.ఈ మూవీ రిలీజ్ అయి 20 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే దీని గురించి మాట్లాడుకునే వారు ఉన్నారు.ఇందులోని పాటలు కూడా వింటుంటారు.

వెంకటేష్ ఈ సినిమాలో కామెడీ బాగా పండించాడు.కత్రినా కైఫ్ తన అందంతో నిజంగానే యువరాణి లాగా కనిపించింది.అయితే కత్రినా అందంగా కనిపించినా ఆమెకు సరిగా యాక్ట్ చేయడం రాదనే ఒక పెద్ద విమర్శ ఉంది.

దీని గురించి మల్లీశ్వరి డైరెక్టర్ విజయభాస్కర్( K.Vijaya Bhaskar ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.మల్లీశ్వరి సినిమాలో కత్రినాకు ఎలా నటించాలో నేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని ఒప్పుకున్నారు.

ఆమెకు అసలే యాక్టింగ్ రాదని అనడం తప్పు అని కూడా చెప్పుకొచ్చారు.

యూకే కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారిన వలస వ్యతిరేక నిరసనలు..!
తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వల్లే సాధ్యం అవుతుందా..?

"మల్లీశ్వరి కత్రినాకు రెండో సినిమా.ఆ సమయంలో ఆమె నటనలో ఓనమాలు దిద్దుతున్న ఒక చిన్న పిల్ల.సరిగా నటించడం రాదు అనే విషయం ఆమెకూ తెలుసు.

Advertisement

అందుకే చెప్పిన మాట వినేది.ఫారిన్ కంట్రీలో పుట్టి పెరగడం వల్ల తెలుగు అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఆమెకు తెలియదు.

అందుకే తాతయ్య పక్కన కూర్చునేటప్పుడు, మిగతా సందర్భాల్లో తెలుగు అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో నేను చేసి చూపించాల్సి వచ్చింది.""ఒక ప్రకటనలో కత్రినా కైఫ్‌ను చూశాను.

అప్పుడే ప్రిన్సెస్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్‌ అవుతుందని అనుకున్నాను.ముంబై కి వెళ్లే ఆమెకు కథ చెప్పాను మొదట ఓకే అన్నది.

ఆ తర్వాత అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు.నటించలేనన్నట్లు ప్రవర్తించింది.

అలాంటి సమయంలో ఆల్రెడీ స్టార్స్ అయిన హీరోయిన్లను తీసుకుందామని నిర్మాత చెప్పాడు కానీ ఎవరూ చూడని ఒక కొత్త ముఖాన్ని యువరాణిగా చూపిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడ్డాను.అందుకే పట్టుబట్టి మరీ ఆమెని నటింప జేశాను.

కొంచెం తిప్పలు పెట్టింది కానీ కత్రినా చాలా హార్డ్ వర్కర్. ఏదైనా చెప్తే కష్టపడి నేర్చుకుంటుంది.

" అని విజయభాస్కర్ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు