బాలీవుడ్ లో ఇప్పుడు ఈ స్టార్ కపుల్ పెళ్లి గురించే మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.లవ్ బర్డ్స్ గా విహరించి ఇప్పుడు వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.
వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.వీరు ఇప్పటికే వెరీ మధ్య ఉన్న బంధం గురించి మీడియాకు బహిర్గతం చెయ్యక పోయిన మీడియా మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా రోజులుగా ప్రచారం చేస్తుంది.
వీరిద్దరి వివాహం డిసెంబర్ 7 నుండి 12 వరకు జరగబోతుందని తెలుస్తుంది.అది కూడా ఫేమస్ ప్యాలెస్ లో జరగబోతుందని టాక్. రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని తెలుస్తుంది.అయితే వీరి పెళ్లి కొద్దీ మంది బంధుమిత్రుల మధ్యనే జరగబోతున్నట్టు టాక్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కంత మంది సినీ సెలెబ్రిటీలు మాత్రమే ఈ పెళ్ళికి హాజరవుతారట.సినీ సెలెబ్రిటీలు ఎవరెవరు హాజరవ్వ బోతున్నారో కూడా బయటకు వచ్చింది.
డైరెక్టర్ కబీర్ ఖాన్ అతని భార్య మినీ మాధుర్, కారం జోహార్, రోహిత్ శెట్టి, ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ, వరుణ్ ధావన్ అతడి భార్య నటాషా మాత్రమే బాలీవుడ్ నుండి హాజరయ్యే సెలెబ్రిటీలని తెలుస్తుంది.

ఇంకా ఈ పెళ్ళికి అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, సల్మాన్ ఖాన్ లకు కూడా ఆహ్వానం అందినా వారు షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల పెళ్ళికి హాజరవ్వలేక పోతున్నారని తెలుస్తుంది.ఇక వీరితో పాటు రణబీర్ కపూర్- ఆలియా భట్ లకు కూడా ఆహ్వానం అందిన వారు కూడా తమ పెళ్లి ప్లన్స్ లో బిజీగా ఉండడం వల్ల ఈ జంట హాజరవ్వలేక పోతున్నట్టు సమాచారం.ఇక ఈ పెళ్ళికి ఈ సెలెబ్రిటీలతో పాటు మొత్తం 125 మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తుంది.
అయితే ఇంత జరుగుతున్న ఈ జంట నుండి మాత్రం అధికారిక ప్రకటన అయితే రాలేదు.