బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కత్రినా కైఫ్ ఒకరు.ఈమె వరుస సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది.
స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.ఈమె ఎవ్వరు చెయ్యలేని పాత్రలను కూడా చేస్తుంది.
ఈమె ఇప్పటికే చాలా యాక్షన్ పాత్రలను చేసింది.మిగతా హీరోయిన్స్ ఈ పాత్రలంటేనే బయపడతారు.
కానీ కత్రినా మాత్రం ఎలాంటి పాత్రకు అయినా ఓకే చెప్పేస్తుంది.
ఇప్పటి వరకు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ మ్యాన్ తరహా సినిమాలు వచ్చాయి కానీ సూపర్ ఉమెన్ సినిమాలు మాత్రం ఒక్కటి కూడా రాలేదు.
మరి ఇప్పుడు అలంటి సినిమా ఒకటి బాలీవుడ్ లో రాబోతుందని టాక్ వినిపిస్తుంది.బాలీవుడ్ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఒక సూపర్ ఉమెన్ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో అలీ అబ్బాస్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఒక భారీ యాక్షన్ సినిమా స్టార్ట్ కాబోతుంది.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.మరి సూపర్ ఉమెన్ గా కత్రినా కైఫ్ ఎలా నటించి ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.ఈమె ఇప్పటికే చాలా యాక్షన్ సినిమాల్లో నటించింది.దీంతో ఈమె అయితే సూపర్ ఉమెన్ పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.ఆమె ఫ్యాన్స్ కూడా ఈమెను ఎప్పుడెప్పుడు సూపర్ ఉమెన్ పాత్రలో చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.
కత్రినా ఇటీవలే పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తుంది.పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఇంకా స్టార్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది.
మరి మన ఇండియాలో సూపర్ ఉమెన్ పాత్రలో నటించే మొదటి హీరోయిన్ కత్రినా నే అవుతుంది.







