సోషల్ మీడియాలో ఓ లుక్కేశామంటే ఎన్నో డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి.కొంత మందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం.
అందుకే ట్రెండింగ్ సాంగ్ లకు డ్యాన్స్ చేస్తూ క్షణాల్లో వైరల్ అవుతుంటారు.ఇలా కొన్ని వీడియోస్ కడుపుబ్బా నవ్విస్తాయి.
మరికొన్ని డ్యాన్స్ వీడియోలు చూస్తే వావ్ అనిపిస్తుంది.కొన్ని వీడియోస్ చూస్తే కర్మరా బాబు మళ్లి చూడకూడదు అనిపిస్తుంది.
ఇలా కొంచెం కొత్తగా అనిపిస్తే చాలు ఆ వీడియో ఎక్కడికో వెళ్లి పోతుంది.లైకులు.
కామెంట్స్ తో తెగ వైరల్ అవుతుంటుంది.సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఎన్నో అవకాశాలను అందుకున్నారు.
టీవీ షోలలో.సినిమాల్లో చాన్స్ కొట్టేస్తుంటారు.
మొన్నటివరకు కచ్చాబాదం.ఓ రేంజ్ లో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.ఎంతో మంది యువత, సెలబ్రిటీలు.డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
దీంతో ఎంతో మంది ఫేమస్ అయ్యారు.కాగా ఈ సాంగ్ పాడిన కచ్చా బాదమ్ అమ్ముకునే వ్యక్తి స్టార్ అయిపోయాడు.
ఓ మ్యూజిక్ సంస్థ ఏకంగా ఆతనితో సాంగ్ కంపోజ్ చేసింది.పల్లీలు అమ్ముకుంటూ సరదాగా కచ్చా బాదమ్.
అంటూ పడుకుంటే.జనాలకు తెగ నచ్చేసింది.
ఈ సాంగ్ తో డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.ఇలా ఎంతో మంది పాపులారిటీ సంపాధించారు.
ప్రస్తుతం ఓ బామ్మ కూడా తన డ్యాన్స్ తో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఆరుపదుల వయసులో కూడా హీరోయిన్స్ కి తీసిపోకుండా స్టెప్పులు వేస్తోంది.పుష్పా మూవీలోని సామీ.సామీ.
సాంగ్ కు తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి సవాల్ విసురుతోంది.మరిన్ని డీజే సాంగ్స్ కు కూడా డ్యాన్స్ ఇరగదీసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్స్ బామ్మ ఎనర్జీ లెవల్స్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు.
మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి….







