కాటపల్లి బ్రిడ్జి వేశారు...500 మీటర్ల పొడుగు రోడ్డు మరిచారు...!

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో రాయగిరి-మోత్కూర్ ప్రధాన రహదారిపై ముస్త్యాలపల్లి గ్రామశివారు కాటపల్లి నుండి రాయిపల్లి వరకు నిర్మాణ పనులకు 2021 ఆగష్టు 4న సి5 ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత ప్రభుత్వ అనుమతులు పొంది, దాదాపు నాలుగేళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు సాగదీస్తూ వచ్చారు.మీడియాలో ప్రత్యేక కథనాలు రావడంతో పాటు పలు రాజకీయ పార్టీలు,యువజన,ప్రజా సంఘాలు పలుమార్లు నిరసన వ్యక్తం చేయడంతో దపదఫాలుగా రోడ్డు పనులు పూర్తి చేశారు.

 Katapalli Bridge Was Built, 500 Meters Long Road Was Forgotten , Forgotten, Kat-TeluguStop.com

కానీ,కాటపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి మట్టి పోసి రోడ్డు వేయకుండా వదిలేశారు.బ్రిడ్జి ఇరువైపులా కలిసి దాదాపు 500 మీటర్ల పొడుగు రోడ్డు నిర్మాణం చేపట్టకుండా ఆలస్యం చేస్తున్నారు.

ఈ మట్టి రోడ్డులో వర్షాల కారణంగా ఏర్పడిన గుంతల్లో నీళ్లు నిలుస్తూ ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.మామూలు సమయాల్లోనే గుంతల్లో ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తున్న సమయాల్లో బైక్ స్కిడై రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి.

ఇక భారీ వాహనాలు ప్రయాణించే టప్పుడు మట్టి రోడ్డు నుండి వెలువడే దుమ్ము ధూళితో బాటసారులకు, వాహనదారులకు పలు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.ఈరహదారిలో ప్రయాణించే వారు బ్రిడ్జి దాటితే రాయగిరికి చేరినట్లేనని భావించే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సదరు కాంటాక్టర్ పై చర్యలు తీసుకొని వెంటనే మిగిలిన రోడ్డును పూర్తి చేయాలంటున్నారు.అయితే ఈ రోడ్డు పనులకు గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వం మారడంతో పనుల్లో ఆలస్యం జరుగుతుందనే చర్చ కూడా నడుస్తుంది.

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక దృష్టి సారించాలని స్ధానికులు కోరుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube