గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం…నమ్మదగిన సమాచారం మేరకు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్,ఎస్సై రవి,సిబ్బంది పట్టణంలో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిర్యాలగూడ పట్టణ శివారులో అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకొని వాహనాలు తనిఖీ చేయగా 35 లక్షల విలువ గల వాహనాలలో 140.585 కిలోల గంజాయి, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

 Suspect Arrested For Smuggling Ganja, Suspect Arrested ,smuggling Ganja, Nalgond-TeluguStop.com

అదుపులోకి తీసుకున్న భూక్యా రామును విచారించగా సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలానికి చెందిన నూనవత్ జగన్, నూనావత్ మంచ్యా నాయక్ లు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి రెండు వాహనాలను తెచ్చి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్ళే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని రెండు వాహనాలలో లోడ్ చేసుకుని జగన్,మంచ్య నాయక్ ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

ఈ అక్రమ రవాణాలో పెన్ పహాడ్ మండలానికి చెందిన మరికొంత మంది ఉన్నట్లు తెలిపాడు.పరారీలో ఉన్న నిందితుల కోసం మిర్యాలగూడ డిఎస్పీ ఆద్వర్యంలో ముగ్గురు సి‌ఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు నిందితుల విచారంలో తేలనుంది.పట్టుబడ్డ రాము, ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నాయి.

పట్టుబడని నిందితులు నూనవత్ జగన్, నూనావత్ మంచ్యా నాయక్, బాణోతు సాయి,ఆంగోతు నాగరాజుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం.అక్రమ గంజాయి, మాదకద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని,ఎంతటి వారినైనా ఉపేక్షించమని హెచ్చరించారు.

యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,గంజాయి విక్రయాల గురించి గాని, సేవించే వ్యక్తుల గురించి ఏ రూపంలోనైనా మాదకద్రవ్యాలను సరఫరా చేసేవారి గురించి మీకు సమాచారం తెలిస్తే డయల్ 100 ద్వారా లేదా నేరుగా తెలియజేయవచ్చని,సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.మాదకద్రవ్యాల నివారణలో ప్రజలు,పోలీసు వారికి సహకరించి మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అందరూ పాలుపంచుకోవాలని కోరారు.

ఈ కేసులో బాగా పనిచేసిన మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు,వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్,హాలియా ఇన్స్పెక్టర్ జనార్ధన్,హాలియా ఎస్సై సతీష్,వన్ టౌన్ ఎస్ఐ రవి,సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube