కోట్ల విలువైన చెరువు భూములు మాయం

నల్లగొండ జిల్లా: భూముల ధరలకు రెక్కలు రావడంతో ఎక్కడ ప్రభుత్వ,ప్రైవేట్ భూమి ఖాళీగా కనిపించినా అక్రమార్కులు గద్దల్లా వాలిపోయి ఆక్రమించేస్తున్నారు.వారికి రాజకీయ నేతలు అండదండలు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Pond Lands Worth Crores Lost, Pond Lands , Nalgonda District, Lokanaboina Ramana-TeluguStop.com

నల్లగొండ పట్టణానికి ఆనుకొని ఉన్న వల్లభారావు చెరువు, బతుకమ్మ కుంటలోని కోట్ల విలువైన భూములను కొందరు ఆక్రమించి,అక్రమ నిర్మాణాలు చేపట్టగా మత్స్యకారుల సంఘం నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

అయినా మళ్ళీ యధావిధిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపించాలని కోరుతున్నారు.లేదంటే చెరువు భూములు కబ్జాలు చేసి అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తామే కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారు.

చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ అన్నారు.

గత మూడు నాలుగేళ్లుగా పల్లభరావు చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసే పోరాటం చేస్తున్నారు.

గతంలో జిల్లా యంత్రాంగం కదిలి చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలను డోజర్లను పెట్టి కూల్చివేశారు.కానీ,సర్వే చేసి నూతన హద్దురాళ్ళను నాటి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలుమార్లు కోరిన ఇప్పటివరకు రెవిన్యూ అధికారులు ఎలాంటి సర్వే చేయకుండా వదిలేశారు.

దీనితో అక్రమార్కుల మళ్ళీ కట్టడాలు షురూ చేశారు.ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube