నిన్న ప్రకటన.. నేడు షూట్.. తెలుగు హీరోలు చూసి నేర్చుకోండయ్యా..

Kashmir Schedule Of Thalapathy 67 Begins, Thalapathy 67, Thalapathy Vijay, Thalapathy 67 Begins, Trisha, Lokesh Kanagaraj, Kashmir Schedule,

మన స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్ ను సైతం విసిగిస్తున్నారు.అయితే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం మొన్న ప్రకటించాడు.

 Kashmir Schedule Of Thalapathy 67 Begins, Thalapathy 67, Thalapathy Vijay, Thala-TeluguStop.com

ఈ రోజు వెంటనే షూట్ స్టార్ట్ చేస్తున్నాడు.ఇంత స్పీడ్ చూసి మన తెలుగు హీరోల ఫ్యాన్స్ విజయ్ దళపతిని చూసి నేర్చుకోండయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విజయ్ దళపతి ఇటీవలే వారసుడు సినిమాతో సంక్రాంతి కానుకగా వచ్చి ప్రేక్షకులను అలరించాడు.మరి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగానే వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాడు.

మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో తన 67వ సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా మొన్న గ్రాండ్ గా చెన్నైలో స్టార్ట్ చేసారు.

ఈ సినిమా స్టార్ట్ కాకుండానే భారీ అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా నుండి టైటిల్ కూడా రాబోతుంది.దీని కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.కానీ అంతకంటే ముందే మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ సినిమా షూట్ కోసం చిత్ర యూనిట్ మొత్తం కాశ్మీర్ కు స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరింది.అందుకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ నెట్టింట పోస్ట్ చేసింది.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.అప్పుడే షూట్ స్టార్ట్ కావడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుండగా.సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో అర్జున్, ప్రియా ఆనంద్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube