ఇదేందయ్యా ఇది.. ఆ సినిమా థియేటర్ లో హిట్.. టీవీలో అట్టర్ ఫ్లాపా?

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి.ఒకసారి మాస్ సినిమానే బాగా ఆదరించిన ప్రేక్షకులు మరోసారి లవ్ సినిమాలను యాక్సెప్ట్ చేస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే థియేటర్లలో సినిమాలను బాగా వీక్షించిన ప్రేక్షకులు ఆ తర్వాత ఓటిటిలో టీవీలలో విడుదల అయినప్పుడు చూడకపోవడంతో థియేటర్లలో హిట్ అయిన సినిమాలకు టీవీలో ఫ్లాప్ టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు తాజాగా హీరో కార్తీ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది.

కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్.

ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసింది.థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.కానీ ఊహించని విధంగా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.వరల్డ్ టెలివిజన్ ప్రీమియం అనగా ప్రసారమైన సర్దార్ సినిమాకు కేవలం 1.48 టిఆర్పి వచ్చింది.అయితే ఈ సినిమా కంటే రెగ్యులర్గా ప్రసారమయ్యే బాహుబలి మహర్షి సన్నాఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాలకు మంచి రేటింగ్ వచ్చింది.

Advertisement

కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పవచ్చు.

అదేమిటంటే అంత పెద్ద హిట్ అయిన సినిమాలు మెయిన్ ఛానల్ లో ప్రసారం చేయలేదు జీ గ్రూప్. అందుకే మూవీస్ ఛానల్లో ప్రసారం చేసింది.దాంతో ఊహించని విధంగా రేటింగ్ అమాంతం పడిపోయింది.

ఒకవేళ సర్దార్ సినిమా మెయిన్ చానల్లో పడి ఉంటే టిఆర్పి బాగా రావడంతో పాటు సర్దార్ సినిమా పరువు అయిన దక్కేది.ఇకపోతే కార్తీ సర్దార్ సినిమాలో తండ్రీ కొడుకుగా కనిపించిన విషయం తెలిసిందే.

ఒక గూఢచారి జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు