కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పిక్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Karthikeya 2 Ott Release Date Fixs When, Karthikeya 2, Ott Release Date , Direct-TeluguStop.com

ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా హిందీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.ఇలా పలు భాషలలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని మలయాళంలో కూడా ఈనెల 23వ తేదీ ఎంతో ఘనంగా విడుదల చేశారు.

ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది.

ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి సుమారు 130 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి నిఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 3 కూడా రాబోతుందని ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందంటూ నిఖిల్ సీక్వెల్ చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.

Telugu Chandu Mondeti, Karthikeya, Nikhil, Ott-Movie

ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని అక్టోబర్ 5వ తేదీ ప్రసారం చేయనున్నట్లు జీ5 అధికారికంగా తెలియజేశారు.దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది అయితే ఇదే రోజే థియేటర్లో నాగార్జున నటించిన ది ఘోస్ట్, చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.ఇలా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో నిఖిల్ కార్తికేయ 2 కూడా ఓటీటీలో విడుదల చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube