యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఏదంటే ఠక్కున గుర్తుకు వచ్చేది కార్తికేయ.పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘ఒక్కో సీన్ మతిపోగొడుతుంది’ అనేలా ఉంటుంది.
దర్శకుడు చందూ ముండేటి డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీలో నిఖిల్ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.
ఇక కథే హీరోగా సాగిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా కార్తికేయ 2 సినిమాను ఇటీవల ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది.అయితే ఈ సీక్వెల్ సినిమా కథ ఎలా ఉంటుందా అని అందరూ సందేహం వ్యక్తం చేస్తుండటంతో ఈ సినిమా సీక్వెల్ కాదని చిత్ర యూనిట్ తెలిపింది.
కార్తికేయ చిత్రంలోని హీరో పాత్ర తప్ప మరే ఇతర అంశం కూడా కార్తికేయ 2లో లేదని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమా కథ ద్వారకలోని ఓ గుడికి సంబంధించిన రహస్యం చుట్టూ తిరుగుతుందని, దాన్ని హీరో ఎలా చేధిస్తాడా అనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
మొత్తానికి ఈ సినిమా సీక్వెల్ కాదని, కొత్త కథతో మనల్ని ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.