టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఉన్నారు.ప్రెసెంట్ నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
నిఖిల్ కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేసాడు.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చి ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.
ఆగష్టు 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ముందు నుండి కూడా టీమ్ అంతా ఈ సినిమా విజయం మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అదే రిలీజ్ తర్వాత కూడా నిజం అయ్యింది.ఈ సినిమా సంచలన హిట్ నమోదు చేసుకోవడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఈ సినిమా మూడు రోజుల్లోనే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.ఇంకా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతుంది.ఇక హిందీలో అయితే చెప్పాల్సిన పని కూడా లేదు.ఈ సినిమాలో కృష్ణుడు గురించి ఉండడంతో ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతున్నారు.
మౌత్ టాక్ తోనే కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది.
అక్కడ రోజురోజుకూ స్క్రీన్ లను పెంచుకుంటూ పోతున్నారు.
రిలీజ్ అయిన 9వ రోజు కూడా 4 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పరిచింది.ఇప్పటికే థియేట్రికల్ వసూళ్ల పరంగా 70 కోట్ల ప్లస్ సాధించిన ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.

అయితే మరో విధంగా ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టు చెబుతున్నారు.థియేట్రికల్ పరంగా 70 కోట్లు వసూళ్లు చేసిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 30 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది.దీంతో ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టే అని అంటున్నారు.మరి చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది అంటే అందరు ఆశ్చర్య పోతున్నారు.
ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే థియేట్రికల్ వసూళ్ల పరంగానే 100 కోట్లు అతి త్వరలోనే సాధించే అవకాశం కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.