బుల్లితెర కార్తీకదీపం సీరియల్ ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే.రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ కి వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారు.
ఈ సీరియల్లో వంటలక్క పాత్రలో నటిస్తున్న దీప (ప్రేమి విశ్వనాథ్)తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని బుల్లితెర సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా ఈ సీరియల్ లో విభిన్న పాత్రలలో నటిస్తున్న డాక్టర్ బాబు, మౌనిత, సౌందర్య, సౌర్య తదితర పాత్రలలో నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
బుల్లితెర సీరియల్స్ లో ఏ సీరియల్ కు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ మన వంటలక్కకు ఉందంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది.
డిసెంబర్ 2న కార్తీకదీపం వంటలక్క బర్త్ డే కావడంతో స్టార్ మా పోస్టర్ ను విడుదల చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమెకు తన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన అభిమాని శుభాకాంక్షలు తెలియజేస్తూ”రేయ్ ఈరోజు మా వంటలక్క బర్తడే….
ఈ రోజు తనని ఎవరు ఏడిపించకండి.తనని ఏడిపిస్తే స్టార్ మా హౌస్ తో పాటు బిగ్ బాస్ హౌస్ ని కూడా తగలబెడతా” అని ఎంతో సరదాగా కామెంట్ చేశారు.

కార్తీకదీపం సీరియల్ లో దీప క్యారెక్టర్ లో ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూ ఏడుస్తూ నటించడంతో ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.కేవలం ఆమె ఏడుపుకు మాత్రమే కోట్లాది మంది మహిళా ప్రేక్షకులను సంపాదించుకున్నారు.మరికొంతమంది మాత్రం ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది రా బాబోయ్ అని చిరాకు పడే వారు కూడా ఉన్నారు.మొత్తానికి కార్తీకదీపం సీరియల్ బుల్లితెరలో ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షోను కూడా తలదన్నేలా 18.5 రేటింగ్స్ తో దూసుకుపోతోంది.