తెగిపోయిన చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళనంటూ కన్నీటి కష్టాలు చెప్పుకున్న కార్తీక దీపం మోనిత!

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి మోనిత అందరికీ సుపరిచితమే.

ఈమె స్వస్థలం కర్ణాటక అయిన అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు సీరియల్స్ లో నటిస్తూ విశేషమైన అభిమానులను దక్కించుకున్నారు.

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. ప్రస్తుతం ఈమె సీరియల్స్ లో నటిస్తూనే సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎన్నో వీడియోలను తన ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక శోభా శెట్టి ఏవైనా బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సూపర్ క్వీన్ కార్యక్రమం గురించి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యే వారి చిన్నప్పటి విషయాలను వారి జీవితంలో వారు ఎదుర్కొన్న చేదు సంఘటనలు గురించి వివరించారు.ఇలా శోభాశెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనగా ప్రదీప్ తనకు సంబంధించిన ఒక ఫోటోను చూపించారు.

Advertisement

ఈ ఫోటో చూడగానే శోభా శెట్టి ఎంతో ఎమోషనల్ అవుతూ చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.

ప్రస్తుతం శోభా శెట్టిని చూస్తే ఎవరైనా చిన్నప్పటి నుంచి ఏదో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిందని భావిస్తారు.కానీ ఆమె చిన్నప్పటి నుంచి కష్టాల కడలిలోనే పెరిగిందని ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.యాంకర్ ప్రదీప్ చూపించిన ఫోటోలో ఈమె తన షూస్ కి సేఫ్టీ పిన్స్ వేసుకునీ ఉన్న ఫోటోను చూపించారు.

ఇక ఈ ఫోటోని చూస్తూ శోభా శెట్టి తన చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను తెలిపారు.

తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలలో పెరిగానని తను ఉంటున్న ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళాలి అంటే సుమారు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుందని ఈమె తెలిపారు.ఇలా ప్రతి రోజు స్కూల్ కి నడిచి వెళ్తున్న సమయంలో షూస్ తెగిపోవడం వల్ల కుట్టించికోవడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవని ఎమోషనల్ అయ్యారు.అలా కొన్నిసార్లు కాళ్లకు చెప్పులు లేకుండా స్కూల్ కి నడిచి వెళ్లానని తెలిపారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

షూస్ కుట్టించుకోవాలి అంటే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు రూపాయలు కూడా తన దగ్గర లేకపోవడం వల్ల ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకుని మరి స్కూల్ కు వెళ్లానని ఇలాంటి ఎన్నో కష్టాలను తాను అనుభవించానని ఈ సందర్భంగా శోభా శెట్టి సూపర్ క్వీన్ కార్యక్రమం ద్వారా తన కష్టాలను బయట పెట్టారు.చిన్నప్పటి నుంచి ఈ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొనీ నటనపై ఉన్న ఆసక్తితో మెల్లిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని,ఈ క్రమంలోనే పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రస్తుతం ఇక్కడ ఈ వేదికపై ఉన్నానని శోభా శెట్టి ఆలియాస్ మోనిత ఈ సందర్భంగా తన కన్నీటి కష్టాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు