బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ కి ఎంతో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి.డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలలో పరిటాల నిరుపమ్( Nirupam Paritala ) , ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanth ) వంటి వారు ఎంతో ఒదిగిపోయి నటించారు.
ఇలా ఈ రెండు పాత్రలు ఎంతో మంచి ఆదరణ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాయని చెప్పాలి.ఇక ఈ సీరియల్ పూర్తి కావడంతో ఎంతోమంది అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు.
అయితే ఈ సీరియల్ కి రెండో భాగం కూడా రాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు.

ఇక టీవీ సీరియల్స్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సీరియల్ కి కూడా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోలేదు మొదటిసారి కార్తీకదీపం 2 ( Karthika Deepam 2 ) సీరియల్ ఇటీవల హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు పాత్రలో నటించిన నిరుపమ్, వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాథ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా అభిమానులు వీరిద్దరికి హారతులు ఇచ్చి వారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక ఈ సీరియల్ మార్చి 25వ తేదీ నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతున్నట్లు వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబు( Doctor Babu ) మాట్లాడుతూ.కార్తీక దీపం ఫస్ట్ సీజన్ నెంబర్ వన్ సీరియల్ అనిపించుకుంది.అప్పట్లో ప్రజాభిమానానికి కొలమానమైన బార్క్.తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టపడి చూసిన సీరియల్ గా లెక్కల్లో తేల్చేసింది ఒక ఫ్యామిలీ రమ్మని ఎంతో అద్భుతంగా చూపించిన సినిమాగా కార్తీకదీపం పేరు సంపాదించుకుంది.నేను ఎక్కువగా కన్నీళ్లు పెడతాను అని చాలామంది అన్నారు.
నన్ను ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు.ఇవాళ ఓసారి వెనక్కి తిరిగి చూస్తే.
ఈ కార్తీక దీపం సీరియల్లో చేసిన ప్రతి క్షణాలు గుర్తుకు వస్తాయి అంటూ ప్రేమి విశ్వనాథ్ తెలిపారు.