నేను చూసిన అరుదైన నటులు వీళ్లే.. పవన్ తో కార్తీని పోలుస్తూ?

తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్.ఈ సినిమాకు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలు రాశి ఖన్నా, రజిషా విజయన్ లు హీరోయిన్ లుగా నటించారు.కాగా ఈనెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.నాకు కార్తీ కి మంచి అనుబంధం ఉంది.మేమిద్దరం కలిసి ఊపిరి సినిమాలో నటించాము.

అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పణలో సర్దార్ సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు నాగార్జున.కార్తీ అన్నయ్య సూర్య ఒక సూపర్ స్టార్.

అలాంటి స్టార్ నటుడు తమ్ముడు ఇమేజ్ నుంచి బయటికి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం అన్నది తేలికైన విషయం కాదు అని తెలిపారు నాగార్జున.అలాంటి వారు చాలా అరుదు ఇక తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, కన్నడలో శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ కుమార్, తమిళంలో సూర్య తమ్ముడు కార్తీ నేను చూసిన అరుదైన నటులు.

ఈ ముగ్గురు హీరోలు కూడా నేను చూసిన అరుదైన నటులు.కార్తీ అనేక రకాల విభిన్న పాత్రలు పోషించి తన అన్నయ్య సూర్యలా సూపర్ స్టార్ అయ్యాడు.పాటలు బాగా పాడుతాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

తెలుగులో కూడా బాగా మాట్లాడుతాడు.అందుకే కార్తీ ని తెలుగు వారు కూడా విశేషంగా అభిమానిస్తారు అని నాగార్జున చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక చివర్లో చిత్ర బృందానికి తన తరుపున శుభాకాంక్షలు తెలిపారు నాగార్జున.

తాజా వార్తలు