వాట్ ఎ టాలెంట్: యువతి టాలెంట్ కు దాసోహం అంటున్న నెటిజన్స్..!

ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన జాతీయ గీతం వింటే చాలు లేచి నిలబడి మరి తమ దేశభక్తిని చాటుకుంటారు.

జాతీయ గీతం వింటే చాలు మన మది ఆనందంతో పులకరించిపోతుంది.

అలాంటి మన దేశ జాతీయ గీతాన్ని ఆకులలో రూపొందించడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.ఒక విద్యార్థిని తనకు ఉన్న టాలెంట్ తో విభిన్న కళాకృతులను రూపొందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

కేవలం ఒక్కరోజులోనే ఆకులతో జాతీయ గీతాన్ని రాసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించింది.ఆకులపై జాతీయ గీతం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఈ యువతి మాత్రం అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించి అందరిని ఆశ్చర్యపరిచింది.మన జాతీయ గేయాన్ని ఆకులపై చెక్కి వారెవ్వా అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిద్దాపుర్​ కు చెందిన తృప్తి మంజునాథ అనే విద్యార్థిని కార్వారాలోని బాదా శివాజి ఇంజనీరింగ్ కళాశాలలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది.

Advertisement

సాధారణ రైతు కుటుంబానికి చెందిన తృప్తి మంజునాథకు మొదటి నుంచి లీఫ్ ఆర్ట్స్​పై ఇంట్రెస్ట్ ఉండేది.ఆ ఆసక్తితోనే పలు రకాల ఆర్ట్స్ వేసేది.

ఈ క్రమలోనే ఈ ఏడాది మే 19న మన దేశ జాతీయ గీతాన్ని ఆకులపై హిందీలో తీర్చిదిద్దింది.కళల్లో కెల్లా లీఫ్ ఆర్ట్ అనేది చాలా భిన్నమైనదిగా తృప్తి చెబుతుంది.

లీఫ్ ఆర్ట్ లో భాగంగా ఆకు మిగతా భాగాన్ని అంతా కట్ చేసి, కేవలం కావాల్సిన చిత్రాన్ని తయారుచేయడమే లీఫ్ ఆర్ట్స్​.తృప్తి వేసిన లీఫ్ ఆర్ట్ కు ఇండియా బుక్ ఆఫ్​ రికార్డ్​లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని తృప్తి మంజునాథ అంటుంది.అంతేకాకుండా తనకు ఉన్న ఈ టాలెంట్ ను ఎవరైనా నేర్పించమని అడిగితే కచ్చితంగా నేర్పిస్తానని చెబుతోంది తృప్తి.

జాతీయ గీతంతో పాటుగా పువ్వులు, జంతువులు లాంటి రకరకాల కళాకృతులను కూడా ఆకులపై తీర్చిదిద్దాను అని చెప్తుంది తృప్తి.మొత్తంగా లీఫ్ ఆర్ట్ లో భాగంగా 8 ఆకులను ఉపయోగించింది.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

ఈ లీఫ్ ఆర్ట్ సాధనలో తన కుటుంబ సభ్యులు తనకు ఎంతగానో సహాయం చేశారు అని తృప్తి చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు