కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా లాక్ డౌన్ ప్రకటిస్తూ వచ్చాయి.అయితే ముందు ప్రకటించిన లాక్ డౌన్ ను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు.
తెలంగాణాలో ఆల్రెడీ మే 12 నుండి 21 వరకు లాక్ డౌన్ పెట్టగా దాన్ని మరో 10 రోజులు పొడిగించారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో 10 రోజులు లాక్ డౌన్ ఉంటుందని టాక్.
అయితే కొద్దిపాటి సడలింపులు ఉంటాయని అంటున్నారు.ఇక కర్ణాటకలో కూడా జూన్ 7 వరకు లాక్ డౌన్ ప్రకటించారు.
అయితే జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుందు.కర్ణాటక మంత్రి బసవ రాజ్ బొమ్మై శనివారం ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వ సూచనలతో లాక్ డౌన్ కొనసాగిస్తామని అన్నారు.
లాక్ డౌన్ పొడిగింపుపై సిఎం యడియూరప్ప తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కర్ణాటకలో ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్ డౌన్ విధించబడి ఉంది.
ఈ లాక్ డౌన్ కొనసాగించబడుతుంది అని బసవరాజ్ అన్నారు.జూన్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉందని అప్పటి వరకు కఠిన చర్యలు అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని అన్నారు.
సిఎం యడియూరప్ప త్వరలోనే మంత్రులతో సమావేశమై లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చిస్తారని తెలిపారు.