Deputy CM DK Shivakumar : సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( Deputy CM DK Shivakumar )కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.2018 నాటి మనీలాండరింగ్ కేసును( Money laundering case ) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

అయితే గతంలో కాంగ్రెస్( Congress ) అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన శివకుమార్ అక్రమంగా నగదు సంపాదించుకున్నారని, పన్ను ఎగవేత కోసం ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ ఆగస్ట్ 2, 2017 లో ఢిల్లీలోని నిందితుల ఆస్తులపై సోదాలు నిర్వహించింది.ఈ సోదాల్లో లెక్కలు చూపని నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు