దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక( Karnataka ) అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.అధికార బీజేపీ మరోసారి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో పక్క పార్టీ నుండి వచ్చిన వారి సాయంతో బీజేపీ( BJP ) ప్రభుత్వంను ఏర్పాటు చేసింది.గత ఎన్నికల సమయంలో హంగ్ ఏర్పడటంతో బీజేపీ మరియు జేడీఎస్ కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయడం జరిగింది.
కానీ తక్కువ సమయంలోనే అధికారం కోల్పోవాల్సి వచ్చింది.సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో బీజేపీకి కలిసి వచ్చి అధికారాన్ని దక్కంచుకున్న విషయం తెల్సిందే.
ఇప్పుడు అలా కాకూడదనే ఉద్దేశ్యంతో బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.కానీ రాజకీయ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు మాత్రం అక్కడ మళ్లీ హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు కనుక మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్( Congress ) మరియు జేడీఎస్ పార్టీ లు ముందుకు నడుస్తున్నాయి.ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఏ పార్టీ దారి ఎటు అనేది తెలియాల్సి ఉంది.బీజేపీ మాత్రం సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటూ ధీమాతో ఉంది.
మొత్తానికి దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయం తెలియాలంటే మరో నెల రోజులు వెయిట్ చేయాల్సిందే.అన్ని ముఖ్య పార్టీ లకు చెందిన నాయకులు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా అక్కడ ప్రచారం చేయబోతున్నారు.చివరి నిమిషంలో స్టార్ క్యాంపైనర్ హోదా లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా అక్కడ ప్రచారానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.







