కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.మొత్తం 224 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుమైంది.
సాయంత్రం 6 గంటలకు వరకు జరుగుతుంది. 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు.
ఒకరు ట్రాన్స్‌జెండర్.
రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది అర్హులైన ఓటర్లు ఉండగా.వీరిలో పురుషులే (2,67,28,053) అధికం.
మహిళా ఓటర్ల సంఖ్య 2,64,00,074 కాగా.ఇతరులు 4,927 మంది.11,71,558 మంది యువత తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.