కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది.

 Karnataka Assembly Election Schedule Released-TeluguStop.com

రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.అసెంబ్లీ కాలపరిమితి మే 24తో ముగియనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎన్నికల కోసం ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.మే 10వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుందని షెడ్యూల్ లో ఎన్నికల సంఘం పేర్కొంది.

కాగా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.ఎలక్షన్ షెడ్యూల్ నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.

మరోవైపు 80 ఏళ్లు పై బడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్ల కోసం తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోంను ప్రవేశపెట్టబోతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.అయితే ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube