టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ సినిమాను మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా నటించనున్న విషయం తెలిసిందే.ఇకపోతే దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే.ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ను మొదలుపెట్టిన కొరటాల శివ ఈ సినిమాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత మహేశ్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కించి డైరెక్టర్ గా హ్యాట్రిక్ అందుకున్నాడు.ఇక కొరటాల సినిమా అంటే మెసేజ్ తో పాటు హీరో ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలు ప్రూవ్ చేశాయి.
కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విషయంలో కొరటాల అంచనాలు తలకిందులైయ్యాయి.మెగాస్టార్ కెరీర్ లోనే ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఆచార్య సినిమా ప్లాప్ అవడంతో కొరటాల శివ పై భారీగా విమర్శలను గుప్పించిన సంగతి తెలిసిందే.చిరంజీవి అయితే చాలా సార్లు ఆచార్య ప్లాప్ కావటానికి డైరెక్టర్ కొరటాల శివ కారణమంటూ ఇన్ డైరక్ట్ గా కామెంట్స్ చేశాడు.
ఆచార్య సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కొరటాల ఎన్టీఆర్ 30 కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది.గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.ఇక కొరటాల తో ఎన్టీఆర్ మూవీ ఉండదనే మాట కూడా వినిపించింది.అయితే ఎన్టీఆర్ కొరటాల పై ఉన్న నమ్మకంతో ఇచ్చిన మాటకి అలాగే ఫిక్స్ అయ్యాడు.కాకపోతే పాన్ ఇండియా మూవీ తీయాలని కండీషన్ పెట్టాడు.దీంతో కొరటాల ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉండే స్టోరీని రెడీ చేశాడు.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పిక్షనల్ యాక్షన్ కథను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఎన్టీఆర్ తన చేతిలో పెట్టిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి డ్యామేజ్ చేయకుండా డైరెక్టర్ గా కొరటాల ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పవచ్చు.పైగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కించటం కొరటాలకు ఇదే మొదటిసారి.
ఒక విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఇమేజ్ కి మించి తనపై బరువు వేసుకున్నాడు.మరి ఎన్టీఆర్ 30 విషయంలో కొరటాల ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి మరి
.






