బిగ్ బాస్ నుంచి కరాటే కళ్యాణి ఔట్... ఈ వారం డబుల్ పక్కా

బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో ఈ సారి కాస్తా ఆసక్తికరంగానే సాగుతుంది.

రెండో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ షోలో కంటిస్టెంట్ లు అందరూ డాన్స్ లు, కామెడీలతో సందడి చేస్తున్నారు.

చిన్న చిన్న గొడవలు, ఇగోలు కనిపిస్తున్న అందరి మధ్య సందడి వాతావరణం మాత్రం కనిపిస్తుంది.అయితే గత సీజన్ లతో పోల్చి చూస్తే ఈ సారి కంటిస్టెంట్ లు గేమ్స్ విషయంలో అంత కాంపిటీటివ్ గా ఆడటం లేదనే మాట వినిపిస్తుంది.

ప్రతి విషయాన్ని లైట్ గా తీసుకుంటూ వాళ్లకి నచ్చినట్లు ఉంటున్నారు తప్ప గేమ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం లేదనే మాట వినిపిస్తుంది.దీంతో గత సీజన్ లో టైటిల్ ఫెవరెట్ ఎవరో అనే విషయం వేగంగానే ఆడియన్స్ డిసైడ్ చేసేశారు.

అయితే ఈ సారి సందడి కనిపిస్తున్న ఎవరూ కూడా టైటిల్ ఫెవరెట్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.ఇదిలా ఉంటే మొదటి వారంలో హౌస్ నుంచి సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు.

Advertisement

రెండో వారంలో శనివారం రోజునే కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిపొయింది.ఆమె ఎలిమినేట్ కావడంతో పాటు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది.

గంగవ్వ ఈ వారం కూడా సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.గత వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం హౌస్ లో అనవసరంగా ఎక్కువ పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విమర్శల కారణంగానే.

ఇప్పుడు కళ్యాణి కూడా ఇదే తరహాలో విమర్శలను ఎదుర్కొంటు ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది.రెండో వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అవుతుందని మొదటి నుంచి వినిపించినట్లే జరిగింది.

ఎలిమినేషన్ అనంతరం బయటకి వచ్చిన కళ్యాణి హౌస్ లో కంటిస్టెంట్ ల విషయంలో కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది.మరి ఈ సారి డబుల్ ఎలిమినేషన్ లో ఈ రోజు ఉండబోయేది ఎవరనేది వేచి చూడాలి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు