క్రేజీ హీరో విజయ దేవరకొండ హీరోగా, భరత్ కమ్ము దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.
ఇక వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని కసితో ఉన్నాడు.సౌత్ లో ఒకేసారి నాలుగు భాషలలో రిలీజ్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కూడా నాలుగు రాష్ట్రాలలో విజయ్, రష్మిక జోడీ చేస్తుంది.
ప్రస్తుతం ప్రమోషన్ మూడ్ లో ఉన్న ఈ టీం త్వరలో విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అవుతుంది.ఇక విశాఖ తీరంలో గ్రాండ్ గా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సినిమా రిలీజ్ కి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా స్పెషల్ షోని బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కోసం ప్రదర్శించినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా చూసిన కరణ్ వెంటనే రీమేక్ రైట్స్ కొనడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాకపోయిన విజయ్ దేవరకొండ, మైత్రీ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు ఇది నిజమని చెప్పడానికి సాక్ష్యంగా ఉంది.
ఇక మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాకుండానే ధర్మా ప్రొడక్షన్ లాంటి పెద్ద సంస్థలో రీమేక్ కి ఒకే అవడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.








