గత కొద్ది రోజులుగా అనిశ్చితి రాజకీయాలతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక రాజకీయాలలో ఒక అంకంకి నేటితో తెరపడింది.వారం రోజులుగా కర్ణాటకలో రాజకీయ నేతలకి నిద్ర లేకుండా చేస్తున్న ఈ రాజకీయ క్రీడాలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి చివరికి చేతులెత్తేసింది.
స్వయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన ఓటమి పాలయ్యారు.తన రాజీనామా లేఖని కుమారస్వామి గవర్నర్ కి సమర్పించారు.
గత వారం రోజులుగా వాయిదా పాడుకుంటూ వస్తున్నా అవిశ్వాస తీర్మాన ఎట్టకేలకు ముగింపు దశకి చేరుకుంది.
సభలో జరిగిన బాల పరీక్షలో కుమారస్వామి కూటమి గెలవాలంటే మేజిక్ ఫిగర్ 103 రావాల్సి ఉండగా, కేవలం 99 మాత్రమే వచ్చాయి.
అదే సమయంలో విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఏకంగా 105 మంది ఓట్లు వేసారు.కాంగ్రెస్, జేడీఎస్ కూటమిపై తిరుగుబాటు ఈ సమావేశానికి 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు వారిలో 15 మంది ఇప్పటికే రాజీనామా చేయగా మిగిలిన వారిలో ఒక ఇండిపెండెంట్ సభ్యుడు, మిగిలిన్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు.
వీరు అనారోగ్య కారణాలతో సభకు హాజరు కాలేదు.మొత్తానికి కుమారస్వామి సర్కారు రెండేళ్ళు పరిపాలన సాగించి ఎప్పటిలాగే అనిశ్చితి రాజకీయాల మధ్య విశ్వాస పరీక్షలో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.







