జనసేన అధినేత, పవన్ కళ్యాణ్‌పై ఏపీ కాపులు అమితమైన నమ్మకంతో ఉన్నారు. రాజకీయాల్లో కాపులకు సముచిత స్థానం దక్కడానికి పవన్ కృషి చేస్తాడని వారు భావించారు.
అయితే వారికి షాక్ ఇస్తూ పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడం కాపులకు పెద్ద షాక్ తగిలినట్టైంది.కమ్మ vs కాపులుగా ఈ రెండు సామజిక వర్గాల మధ్య ఎప్పటి నుండో రాజకీయ వైర్యం కొనసాగుతుంది.
మెజారిటీ కాపులు చంద్రబాబుతో కలిసేందుకు ఇష్టపడటం లేదు. కొన్నేళ్లుగా చంద్రబాబు తమకు ద్రోహం చేశాడని వారు భావిస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేత ముద్రగడ పద్మనాభంను అవమానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది కాపు మేధావులు పవన్ కళ్యాణ్‌కు బీజేపీతో కలిసి ఉండాలని, ఆ తర్వాత వచ్చే ప్రతి ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
2024 ఎన్నికల తర్వాత టీడీపీ దెబ్బతింటుందని, ఏపీ రాజకీయాల్లో జనసేన-బీజేపీ కూటమి రెండో స్థానంలో ఉంటుందని కూడా కాపులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వారు మాటలు పట్టించుకోకుండా పసుపు పార్టీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నిస్తున్నరని అంటున్నారు. టీడీపీతో చేస్తున్న రాజకీయాల వల్ల కాపులు చాలా మంది పవన్ కళ్యాణ్ వెంట లేరని అంటున్నారు.కాపులు తమంతట తాముగా బలమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటుండగా, పవన్ కళ్యాణ్ టీడీపీ అనుకూల వైఖరి వారిని ఇబ్బందులను పెడుతుంది.
2024 ఎన్నికల్లో టీడీపీ-జన సేన పొత్తును కాపు నేతలు చాలా మంది అంగీకరించడం లేదని, హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నాయుడును సందర్శించడంపై కాపుల్లోని ఒక వర్గం గుర్రగా ఉన్నట్లు సమాచారం.చూడాలి ఈ పోత్తు ఎటూ వైపు తీసుకెళుతుందో.మళ్ళి అధికారంలోకి రావలనుకుంటున్న చంద్రబాబు ప్రయత్నాలు ఎంత వరకు నెరవేరుతాయో.