కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు అన్ని మూత పడ్డాయి.మళ్ళీ ఎప్పటికి తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
దీంతో ఇప్పటికే భారీ బడ్జెట్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఎక్కువకాలంభారాన్ని మోయలేక సినిమాలని ఓటీటీద్వారా రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి. కరోనా టైంని క్యాష్ చేసుకుంటూ పెద్ద మొత్తంలో రైట్స్ రూపంలో ఆశ చూపించి సినిమాలని ఓటీటీ సంస్థలు కొనేస్తున్నాయి.
ఈ సినిమాల ద్వారా వాటికి ఎంత ఆదాయం వస్తుందో తెలియదు కానీ నిర్మాతలకి మాత్రం కరోనాకాలంలో ఓటీటీల ద్వారా వచ్చే సొమ్ము బాగానే గిట్టుబాటు అవుతుంది.సినిమా డిజాస్టర్ అయినా కూడా ఓటీటీ రిలీజ్ కారణంగా నిర్మాతలకి నష్టాలు రావడం లేదు.
దీంతో చాలా మంది డిజిటల్ రిలీజ్ పై ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్ లాంటి పెద్ద సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిపొయింది.
ఇప్పుడు అదే దారిలో లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఇండియన్ ఫస్ట్ వరల్డ్ కప్ నేపధ్యంలో తెరకెక్కిన 83 సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.రణవీర్ సింగ్ ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో నటిస్తూ ఉండగా కపిల్ భార్యగా దీపికా పదుకునే నటిస్తుంది.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.గత మార్చిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ దెబ్బ తో బ్రేక్ పడింది.ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ 83 చిత్రాన్ని అన్నిభాషల్లో రిలీజ్ చేసేందుకు భారీ ఆఫర్ తో ఇచ్చింది.దీంతో ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్యం కావడం, ఎప్పటికి థియేటర్లు తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి ఉండటంతో చిత్ర నిర్మాతలు ఓటీటీకె మొగ్గు చూపుతున్నారని ముంబై సినీవర్గాల టాక్.
ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.