పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.కాగా ఈ సమావేశాలకు కేంద్రమంత్రులతో పాటు పలువురు కీలక నేతలు హాజరవ్వనున్నారు.
ఈ క్రమంలో జనసేనతో పొత్తుపై ముందుకు వెళ్లాలా లేదా అన్న అంశంపై క్లారిటీ ఇవ్వనున్నారు.
మరోవైపు ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కన్నా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే జాతీయ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు.
అయితే కన్నా సమావేశాలకు రావాలని ఆహ్వానం ఉన్న ఎందుకు రావడం లేదో తెలియదని బీజేపీ నేతలు చెబుతున్నారు.







