Kannada Prabhakar : కన్నడ ప్రభాకర్ రియల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య?

నటి అంజు అలియాస్ అంజు ప్రభాకర్ ( Anju Prabhakar )గురించి మనందరికీ తెలిసిందే.అంజు ప్రభాకర్ భర్త ప్రముఖ స్టార్ విలన్ కన్నడ ప్రభాకర్( Kannada Prabhakar) అన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Kannada Prabhakar Wife Anju Say About Shocking Things About Him-TeluguStop.com

కాగా అంజు ప్రభాకర్ ని పెళ్లి చేసుకుని పెళ్లి అయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుని విడిపోయింది.అయితే పెళ్లయిన కొద్ది రోజులకి విడాకులు( Divorce ) తీసుకొని విడిపోవడానికి గల కారణాలు ఏంటి అన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది అంజు.

కాగా నటి అంజు హీరో రాజశేఖర్ నటించిన శేషు సినిమాలో రాజశేఖర్ కి వదినగా నటించిన విషయం తెలిసిందే.ఈమె తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ సినిమాలలో నటిగా నటించింది.

తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.కానీ 17 ఏళ్లలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది.

Telugu Actress Anju, Anju Prabhakar, Tiger Prabhakar-Movie

ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ…ఓ సినిమా 100 డేస్ ఫంక్షన్‌కు వెళ్లినప్ప్పుడు నన్ను చూసిన దర్శకుడు మహేంద్రన్ చైల్డ్ కావాలని చెప్పి ఉదిరిపూక్కల్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.తల్లిదండ్రులకు నేను సినిమాలో నటించడం ఇష్టం లేకపోయినా నటించాను.మా అమ్మ ఇష్టంతో నటించాను.కెలిడీ కన్మణిలో నటించినందుకుగాను మంచి గుర్తింపు వచ్చింది.తర్వాత హీరోయిన్ గా చేయాలని, మంచి క్యారెక్టర్లు, చిన్నదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలని అనుకున్నాను.అందుకే గ్లామర్ పాత్రలో కూడా నటించాను అని చెప్పుకొచ్చింది అంజు.

ఓ కన్నడ సినిమా చేసేందుకు తాను బెంగళూరుకు వెళ్లినప్పుడు కన్నడ ప్రభాకర్ అలియాస్ టైగర్ ప్రభాకర్, తన సన్నిహితుల ద్వారా తనను పెళ్లి చేసుకుంటానని కబురు పంపారని, అప్పుడు తన వయస్సు 17 ఏళ్లని, తాను పెళ్లికి సిద్ధంగా లేనని, సినిమాలే చేయాలని భావించాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది అంజు.

Telugu Actress Anju, Anju Prabhakar, Tiger Prabhakar-Movie

కానీ ప్రభాకర్ పదేపదే పెళ్లి విషయం గురించే అడగడంతో ఆ విషయం ఆమె తన తల్లిదండ్రులకు చెప్పిందట.అప్పుడు అంజు వాళ్ళ అమ్మ బెంగళూరుకు వచ్చి ప్రభాకర్ ను చూసి షాక్ అయిందట.ఎందుకంటే అప్పటికే ప్రభాకర్ కి ఆమెకి వయసు చాలా డిఫరెన్స్ ఉందని, అంటే తన తండ్రి కంటే వయసు ఎక్కువ 50 ఏళ్లు ఉంటాయి అని తెలిపింది అంజు.

అప్పుడు ఆమె తల్లి తిరిగి వెనక్కి వెళ్లిపోగా తల్లిని ఒప్పించడం కోసం అంజు కూడా తిరిగి ఇంటికి వెళ్లిందట.అయినప్పటికీ తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదట.వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోకపోయే సరికి అంజు చేసేదేమీ లేక ప్రభాకర్ ను పెళ్లి చేసుకుందట.అయితే ఆరు నెలలు కాపురం చేశాక అంజు ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ప్రభాకర్ తన పిల్లల్ని చూపించారట.

అంతే కన్నడ ప్రభాకర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయని, అంజు మూడవ భార్య అని తెలిసి ఆమె మోసపోయిందట.అయితే పెళ్లికి ముందు ఈ విషయం చెప్పకుండా, తనను నమ్మక ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నాడట ప్రభాకర్.

అప్పుడు తిరిగి ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికే వెళ్లిందట.అయితే ప్రభాకర్ దగ్గర నుంచి ఆమె తన పుట్టింటికి వెళ్ళి పోయేటప్పుడు ఒక మాట చెప్పిందట.

అదేమిటంటే.తిరిగి ఈ ఇంటికి రాను.

నేను చనిపోయినా, నువ్వు చనిపోయినా.తిరిగి నీ ముఖం నేను చూడాలనుకోవడం లేదు‘ అని చెప్పేసి వచ్చానని, అందుకే ప్రభాకర్ చనిపోయాక చివరి చూపుకు కూడా వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది అంజు.

ఆ తర్వాత తాను కోలుకోవడానికి చాలా సమయం పట్టినట్లు అంజు చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube