కన్నడ హీరో దిగంత్ మంచలే గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవలే గోవా పర్యటనకు వెళ్ళిన దిగంత్ మంచలే ప్రమాదానికి గురయ్యాడు.
తాజాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.అతను ప్రస్తుతం బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇకపోతే ఇటీవలే తన భార్య ఐంద్రితతో కలసి గోవా పర్యటనకు వెళ్ళిన దిగంత్ మంచలే అక్కడ బీచ్ లో జంప్ చేస్తూ ఉండగా అనుకోకుండా గాయపడ్డాడు.
వెంటనే అతడికి గోవాలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు.
అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.ఇకపోతే దిగంత్ మంచలే వాన సినిమాలో రోల్ పోషించిన విషయం తెలిసిందే.దిగంత్ మంచలే కు అడ్వాన్స్ చేసి చేయడం అంటే చాలా ఆసక్తి ఉండటంతో తరచూ అతడు సైకిలింగ్, ట్రెక్కింగ్, సముంద్రంలో స్క్యూబా డైవింగ్ చేస్తుంటాడట.
అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటాడు.హీరో దిగంత్ మంచలేకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.దిగంత్ మంచలే సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.