మార్షల్ ఆర్ట్స్ లో దుమ్మురేపిన కంగారూలు.. వైరల్ గా మారిన వీడియో

జంతువుల ఫైట్ ఏంటి? మార్షల్ ఆర్ట్స్ ఏంటి? అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాలా నిజం.కంగారూలు మార్షల్ ఆర్ట్స్ లో దుమ్మురేపుతున్నాయి.

 Kangaroos In Martial Arts Video That Has Gone Viral , Marshel Arts, Viral Latest, News Viral, Social Media, Viral Video, Kangaroo-TeluguStop.com

బాక్సింగ్ చేస్తూూ కొట్లాడుకున్నాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కంగారూలు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కొట్టుకోవడం ఏంటి అని నోరెళ్లబెడుతున్నారు.

 Kangaroos In Martial Arts Video That Has Gone Viral , Marshel Arts, Viral Latest, News Viral, Social Media, Viral Video, Kangaroo-మార్షల్ ఆర్ట్స్ లో దుమ్మురేపిన కంగారూలు.. వైరల్ గా మారిన వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో జంతుప్రదర్శనశాలలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.జూ ప్రెసిడెంట్, సీఈవో టిమ్ మోరో ఈ వీడియోను క్యాప్చర్ చేసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఈ వీడియో 31 సెకన్లు ఉండగా.ఇందులో రెండు కంగారూలు కొట్లాడుకుంటున్నాయి.ఒకదానితో ఒకటి పోరాడుతన్నాయి.

కాళ్లతో బాక్సింగ్ చేసుకున్నాయి.ఫైట్ అయ్యాక పంచ్ లు ఇచ్చుకున్నాయి.ఈ వీడియోను షేర్ చేసిన టిమ్.దీనికి మార్షల్ స్పైనల్ మార్షల్ ఆర్ట్స్ అని పేరు పెట్టారు.

అయితే అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఒక కంగారు పారిపోయింది.కంగారూల యుద్ద విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తున్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.మిలియిన్ల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్ ఈ వీడియోకు వస్తున్నాయి.

దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

చివరికి కంగారూలు కూడా బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక కంగారూలు కూడా యుద్దంలోకి దిగేలా ఉన్నాయంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.కంగారూల ఈ యుద్ద కళను చూసిన తర్వాత మంచి అనుభూతి కలుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube