న్యూజిలాండ్- శ్రీలంక ( New Zealand – Sri Lanka )మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ కెన్ విలియమ్సన్ ( Ken Williamson )ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.296 బంతులకు 215 పరుగులు చేసి అవుట్ అయిన విలియమ్సన్, టెస్టుల్లో ఆరవసారి డబల్ సెంచరీ సాధించాడు.దీనితో ఏకంగా సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు.అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబల్ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి.
వీరిద్దరూ కలిసి 363 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.అంతేకాకుండా న్యూజిలాండ్ తరఫున ఎనిమిది వేల పరుగులు చేసిన మొదటి క్రికెట్ గా కూడా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.94 టెస్టుల్లో 164 ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 8124 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు డబల్ సెంచరీలు, 28 సెంచరీలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ( Virat Kohli ) టెస్టులలో 28 సెంచరీలు చేసిన రికార్డును విలియమ్సన్ సమం చేశాడు.ఇతని సగటు సచిన్, కోహ్లీ కంటే అధికంగా ఉంది.కానీ 2022 డిసెంబర్ లో న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీ నుండి విలియమ్సన్ వైదొలిగాడు.న్యూజిలాండ్ శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 లీడ్ లో ఉంది.
విలియమ్సన్ గత కొంతకాలంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.అప్పుడప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో రిటైర్మెంట్ ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నలు చాలానే ఎదురయ్యాయి.ఆ ప్రశ్నలకు తనకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించే వయసు రాలేదని, తనను తాను నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది అనే సమాధానాలు చెప్పేవాడు.చివరకు న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ ల కారణంగా తనను తాను పూర్తిగా నిరూపించుకొని, తనపై వచ్చే విమర్శలకు బ్యాటింగ్ తో సమాధానం ఇచ్చాడు.







