తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమర్తపు మురళి

హైదరాబాద్ లోని రాజమౌహళ్ల నారాయణగూడ పద్మశాలి భవన్ నందు అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ పద్మశాలి సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగినది .

తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మచ్ఛ ప్రభాకర్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమర్తపు మురళి మరియు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు .

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్థాపించిన అఖిలభారత పద్మశాలి సంఘం కి అనుబంధంగా తెలంగాణ పద్మశాలి సంఘం నారాయణగూడ లో ఈ కార్యక్రమం జరిగినది .ఇట్టి కార్యక్రమానికి గౌరవ ఎం ఎల్ సి ఎల్ రమణ , గౌరవ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి , మాజీ ఎమ్మెల్యే వర్ణాల శ్రీరాములు , తెలంగాణ అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి మరియు ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం లు పాల్గొన్నారు .ఎల్ రమణ , శ్రీమతి గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన పద్మశాలి జనాభా 30 లక్షల మంది ఉన్నారు కానీ రాజకీయంగా మన వాటా చాలా తక్కువగా ఉన్నది కాబట్టి కొత్తగా ఎన్నిక అయినా కార్యవర్గం అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలలో రాజకీయంగా చైతన్యపరిచి రాబోయే ఎలక్షన్లలో సర్పంచులు గా , ఎంపీటీసీలుగా , జడ్పిటిసిలుగా , కౌన్సిలర్లు , కార్పొరేటర్లుగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది .ఆ దిశగా రాజకీయంగా ఎదిగితేనే మన పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వారు పిలుపునిచ్చారు .జూన్ 4వ తారీఖున హైదరాబాదులో పద్మశాలి శంఖారావం సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి 33 జిల్లాల్లో ఉన్న పద్మశాలీలందరూ కూడా సభలో పాల్గొని మన సత్తా చాటాలని అన్నారు .33 జిల్లాల లకు సంబంధించిన పద్మశాలీలు పెద్ద ఎత్తున హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది తెలిపారు .ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుండి ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు , ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు పెండెం జనార్ధన్ , యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బండారి శ్రీనివాస్ , ఎంప్లాయిస్ విభాగం జిల్లా అధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ , రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి కొండలరావు , మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం సునీత , వింజమూరి సంధ్యారాణి , గుడ్ల శ్రీనివాస్ , కమర్తపు శ్రీధర్ , పులిపాటి సంపత్ , రచ్చా శ్రీనివాస్ , పంతంగి అశోక్ , పారుపల్లి సత్యనారాయణ , దేవరశెట్టి సత్యనారాయణ , మొరం పాపారావు , గద్దె వెంకట్రావు , మరిపల్లి భాస్కర్ , కమర్థపు శ్రీను , ఎలగందుల సత్యనారాయణ , కమర్తపు నాగేశ్వరరావు , పిల్లలమర్రి విజయలక్ష్మి , భీమనపల్లి సంధ్య , పంతంగి రేణుక తదితరులు పాల్గొన్నారు .

Kamarthapu Murali As The State General Secretary Of Telangana Padmasali Sangam-�
టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే జలసీగా ఉంటుంది... నటుడు విక్రమ్ షాకింగ్ కామెంట్స్! 

Latest Press Releases News