'ఇండియన్ 2'లో స్టార్ హీరో గెస్ట్ రోల్.. విజిల్స్ వేయాల్సిందేనట!

యూనివర్సల్ స్టార్ విశ్వనాయకుడు కమల్ హాసన్(kamal haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

ఈ సినిమా ఈయన కెరీర్ లో మళ్ళీ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.

దీంతో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు.కమల్ హాసన్ నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఇండియన్ 2.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ మళ్ళీ మొదలైన ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్( Shankar ) తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో ఒక అతిథి రోల్ ఉందని అందుకోసం ఒక స్టార్ హీరోను చూపించ బోతున్నారు అని క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ పాత్ర కేవలం ఒక రెండు నిముషాల పాటు ఉన్న అందుకోసం స్టార్ హీరో నటించాడని క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ సన్నివేశం థియేటర్స్ లో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది అని అంటున్నారు.ఈ అతిథి రోల్ రెండు సీన్స్ లో కనిపిస్తుందని.అంటున్నారు.

Advertisement

మరి కమల్ కోసం శంకర్ ఏ స్టార్ హీరోను తీసుకు వచ్చారో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ ఏడాది ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

చూడాలి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు