భారతీయుడు2 మూవీ ట్రైలర్ లో ఇది గమనించారా.. ఆ ముగ్గురికీ ఈ సినిమా చివరి సినిమానా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శంకర్( Shankar ) ఒకరు.

ఈయన దర్శకత్వంలో కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భారతీయుడు.

అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే.ఇలా భారతీయుడు సినిమా ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా విడుదలైన రెండు దశాబ్దాలకు భారతీయుడు 2( Indian 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది కానీ డైరెక్టర్ శంకర్ కి లైకా ప్రొడక్షన్ వారితో ఉన్న విభేదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది అయితే కోర్టులో ఈ సమస్య పరిష్కారమైన అనంతరం తిరిగి సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్లో భాగంగా మరణించిన ముగ్గురు నటులు కనిపించటం గమనార్హం.

ఇలా ముగ్గురి నటులకు భారతీయుడు 2 సినిమా ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది.మరి ఆ ముగ్గురు నటులు ఎవరు అనే విషయానికి వస్తే.మనోబాల,( Manobala ) నెడుముడి వేణు( Nedumudi Venu ) , వివేక్( Vivek ) ముగ్గురూ ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే కన్నుమూశారు.

Advertisement

దీంతో భారతీయుడు 2 వీరికి చివరి చిత్రమైంది.అయితే ఇందులో నెడుముడి వేణు, వివేక్ పాత్రల విషయంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారని తెలుస్తోంది.ఇక ఇటీవల విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించిన ఆమె పాత్రను ఎడిట్ చేసినట్టు సమాచారం ఇక్కడ రకుల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు